![]() |
![]() |

ఇంతకుముందు వరకు జబర్దస్త్ లోనే ట్రెండింగ్ కపుల్స్ కనిపించేవాళ్ళు...వాళ్లనే నెటిజన్స్ కూడా ఆరాధిస్తూ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఢీ షోలో కూడా ఆ ట్రెండ్ కనిపిస్తోంది. కొంతమంది కపుల్ కంటెస్టెంట్స్ మాత్రం ఫుల్ ట్రెండ్ అవుతున్నారు. ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో ఆడియన్స్ ని కట్టి పడేస్తున్నారు. వాళ్ళే అన్షు - రాజు, ఆనాల సుస్మిత - పండు, విజయ బిన్నీ మాష్టర్ - రెజీనా అలాగే భూమిక - అభి మాస్టర్ ఇలా. నెక్స్ట్ వీక్ ఢీ షో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉండబోతోందన్న విషయం ప్రోమో చూస్తే తెలుస్తుంది. ఇందులో కాండిల్ లైట్ కపుల్స్ గా వీళ్ళు ఇప్పుడు ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇక అన్షు - రాజు ఐతే నిజంగానే ప్రేమలో ఉన్నట్టు ఈ షో ద్వారా లవ్ ని ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు. "నీ కోసం రెక్కల గుర్రాన్ని తేలేకపోవచ్చు కానీ రెక్కలు ముక్కలు చేసుకుని మిమ్మల్ని ఒక రాణిలా చూసుకుంటాను" అంటూ అన్షుకి ప్రామిస్ చేసాడు రాజు.
ఇక జడ్జ్ రెజినా ఐతే "అన్షు నువ్వు కూడా ప్రేమను ఫీలవుతున్నావా" అని అడిగేసరికి సిగ్గుతో తలదించుకుంది. ఇక సంకేత - శార్వరి ఇద్దరూ కలిసి ఒక ఒక ప్రేమ పాటకు డాన్స్ చేసి అందరినీ ఫిదా చేసేసారు. రాజు ఐతే బాయ్స్ మూవీలోంచి 16 ప్రాయంలో అనే సాంగ్ కి డాన్స్ చేసాడు. ఇక అన్షు ఐతే దేవుడికి దణ్ణం పెట్టుకుని "నాకు కూడా నువ్వంటే కొంచెం ఐ లవ్ యు " అని చెప్పింది. రాజు రెడ్ ఇచ్చాడు. అన్షు హగ్ చేసుకుంది. ఇక హోస్ట్ నందు ఐతే అరేయ్ వదినమ్మరా అనేసరికి అన్షు దణ్ణం పెట్టేసింది.
![]() |
![]() |